Wednesday, 12 August 2020

గంగి గోవు పాలు గంటెడైనను జాలు

గంగి గోవు పాలు గంటెడైనను జాలు
గడివెడైన నేమి ఖరము పాలు?
భక్తి గల్గు కూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినురవేమ!

మంచి ఆవు పాలు ఒక గరిట అయినా మంచిదే.దాని వలన ప్రయోజనము వుంటుంది.కానీ గాడిద పాలు కడవ నిండుగా వున్నా వృథానే.ఏమీ ప్రయోజనము ఉండదు.అలాగే ప్రేమగా,ఆదరంగా పెట్టే అన్నము ఒక్క పిడికెడు అయినా తృప్తిగా వుంటుంది.పంచ భక్ష్యపరవాన్నాలు అయినా ఈసడించుకుంటూ,అవమానిస్తూ పెడితే కడుపు నిండదు.మనసుకు తృప్తినివ్వదు.గాడిద పాల లాగా బిందెనిండా ఉన్నా ప్రయోజనము లేకుండా పోతుంది.

Wednesday, 5 August 2020

నిక్కమైన నీలమొక్కటి చాలు

నిక్కమైన నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చదువ పద్య మరయ జాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ!
భలే భలే రంగుల గాజురాళ్ళు,వింత వింత కాంతులతో మెరుస్తూ బుట్టెడు వున్నా,ఏమీ ప్రయోజనము లేదు.అవి అన్నీ కలిసినా నల్లగా వుండే ఒక్క నీలం అనే రత్నానికి సాటి రావు.అఛ్చం అలాగే పస లేని,వ్యర్థమైన పద్యాలు కుప్పలు,తెప్పలు ఉన్నా,మంచిగా ఉండే చదువతగిన ఒక పద్యానికి సాటికావు.

Friday, 19 June 2020

సకల తీర్థములను సకల యజ్ఞములను

సకల తీర్థములను సకల యజ్ఞంబుల
తలలు గొరిగినంత ఫలము గలదె
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినురవేమ//

సతుల చూడచూడ సంసారి కాగోరు
సుతులు పుట్ట పుట్ట వెతల బడును
గతులు చెడగ చెడగ కర్మమం చేడ్తురు
విశ్వదాభిరామ వినురవేమ //

సుగుణవంతురాలు సుదతియై యుండిన
బుద్ధిమంతు లగుచు పుత్రు లొప్ప
స్వర్గ మేటి కయ్య సంసారి కింకను
విశ్వదాభిరామ వినురవేమ //

హీనగుణము వాని నిలుసేర నిచ్చిన
ఎంత వానికైన నిడుమ గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ వినురవేమ //

హృదయమందు నున్న ఈశుని దెలియక
శిలల కెల్ల మ్రొక్కు జీవులార!
శిలల నేమి యుండు జీవులందే కాక?
విశ్వదాభిరామ వినురవేమ //

హేమనగము చేత నెప్పుడు గలవాడు
వెండి కొండ పైని వెలయువాడు
ఎత్త వలసె బిచ్చ మేమన వచ్చురా
విశ్వదాభిరామ వినురవేమ //

Wednesday, 17 June 2020

వెళ్ళి వచ్చువాడు వెళ్ళి పోయెడు వాడు

వెళ్ళి వచ్చు వాడు వెళ్ళి పోయెడు వాడు
తేను లేడు కొంచు పోను లేడు
తానదేడ బోనొ ధనమేడబోవునో
విశ్వదాభిరామ వినురవేమ //

వేదవిద్య లెల్ల వేశ్యల వంటివి
భ్రమల బెట్టి తేట పడగ నీవు
గుప్త విద్య యొకటె కులకాంత వంటిది
విశ్వదాభిరామ వినురవేమ //

వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును
చీడ పురుగు చేరి చెట్టు చెరచు
కుత్సితుండు జేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ //

వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను
మందు దినక కాని మాన దెందు
చెంత దీప మిడక చీకటి వాయునా
విశ్వదాభిరామ వినురవేమ //

వ్రాత వెంట గాని వరమీడు దైవంబు
చేత కొలదిగాని వ్రాతగాదు
వ్రాత కజుడు కర్త చేతకు తాకర్త
విశ్వదాభిరామ వినురవేమ //

శిలను ప్రతిమ జేసి చీకటింటను బెట్టి
మొక్క వలవదికను మూఢులార
ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడీ
విశ్వదాభిరామ వినురవేమ //

Tuesday, 16 June 2020

లోభివాని జంప లోకంబు లోపల

లోభివాని జంప లోకంబు లోపల
మందు వలదు వేరు మతము గలదు
పైక మడిగినంత భగ్గున పడిచచ్చు
విశ్వదాభిరామ వినురవేమ //

వద్దనంగ పోదు వలెననగా రాదు
తాను చేసి నట్టి దానఫలము
ఉల్లమందు వగవ కుండుటే  యోగంబు
విశ్వదాభిరామ వినురవేమ //

వాక్కు వలన గలుగు పరమగు మోక్షంబు
వాక్కు వలన గలుగు వరలు ఘనత
వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్
విశ్వదాభిరామ వినురవేమ //

విద్యలేని వాడు విద్వాంసుల కడను
ఉండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ కొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ //

విన్నవాని కన్న కన్న వాడధికుండు
కన్నవాని కన్న కలియువాడు
ఉన్నతోన్నతుడయి ఉర్వి లోపల నుండు
విశ్వదాభిరామ వినురవేమ //

వెన్న చేత బట్టి వివరంబు దెలియక
ఘృతము గోరునట్టి యతని భంగి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినురవేమ //

Friday, 12 June 2020

మృగమదంబు జూడ మీద నల్లగ నుండు

మృగమదంబు జూడ మీద నల్లగ నుండు
పరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ //

మేడిపండ చూడ మేలిమై యుండును
పొట్ట విప్పి చూడ పురుగు లుండు
పిరికివాని మదిని బింకమీ లాగురా
విశ్వదాభిరామ వినురవేమ //

రాతిబొమ్మ కేల రంగైన వలువలు
గుళ్ళు గోపురములు కుంభములును
కూడు గుడ్డ తాను గోరునా దైవంబు
విశ్వదాభిరామ వినురవేమ//

రామనామ జపముచే మున్ను వాల్మీకి
పాపి బోయడయ్యు బాపడయ్యె
కులము ఘనము గాదు గుణమె ఘనమ్మురా
విశ్వదాభిరామ వినురవేమ //

రాము డొకడు పుట్టి రవికులం బీడేర్చె
కురుపతియును బుట్టి కులము చెరచె
ఎవరి మంచి చెడ్డ లెంచి చూచిన తేట
విశ్వదాభిరామ వినురవేమ //

లోను జూడ జూడ లోకాభిరామంబు
బయలు జూడ జూడ బంధనంబు
తన్ను జూడ జూడ తారక బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ //

Wednesday, 10 June 2020

మాయ లోన బుట్టి మాయలోన బెరిగి

మాయ లోన బుట్టి మాయలోన బెరిగి
మాయ దెలియలేని మనుజుడేల
మాయ దెలియువాడు మహి మీద ధన్యుండు
విశ్వదాభిరామ వినురవేమ//

మిరెపుగింజ చూడ మీద నల్లగ నుండు
కొరికి చూడలోన చురుకు మనును
సజ్జను లగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ //

మురికిలోన బుట్టి మురికిలోన బెరిగి
మురికి తనువు కింత మురిపెమేల
మురికెరుంగ నతడు మురికిలో బుట్టునా
విశ్వదాభిరామ వినురవేమ //

ముక్తిగానలేని మూర్ఖజనులకెల్ల
బట్టబయలు జేసి పరమపదము
దారిజూపు ఘనుడు దైవంబు గాదొకో
విశ్వదాభిరామ వినురవేమ //

ముచ్చు యాత్రకేగి ముల్లె విడుచుగాని
మొక్క పొద్దు లేదు మొనసి యెపుడు
కుక్క యిల్లు సొచ్చి కుండలు వెదకదా
విశ్వదాభిరామ వినురవేమ//

మూఢభక్తి చేత ముక్కంటి పూజింప
మొన్న బోయవాడు ముక్తుడాయె
పూజకేమి తనదు బుద్ధి ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ//

Monday, 8 June 2020

మనసు లోని ముక్తి మరియొక చోటను

మనసు లోని ముక్తి మరియొక చోటను
వెదుక బోవువాడు వెర్రివాడు
గొర్రె చంకబెట్టి గొల్ల వెదకినట్లు
విశ్వదాభిరామ వినురవేమ //

మనసులోని పుట్టె మాయసంసారము
మనసు విరిగెనేని మాయ తొలగు
మనసు నిల్పెనేని మహితానె బ్రహ్మము
విశ్వదాభిరామ వినురవేమ //

మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు
తెలుపవచ్చు దన్ను దెలియరాదు
సురియ బట్టవచ్చు శూరుడు గారాదు
విశ్వదాభిరామ వినురవేమ //

మాటలాడవచ్చు మర్మము లెరిగిన
పిన్న పెద్ద తనము లెన్నవద్దు
పిన్నచేతి దివ్వె పెద్దగా వెలగదా
విశ్వదాభిరామ వినురవేమ //

మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు
మంత్ర ముడుగకున్న మది కుదురదు
మనసు నిల్పకున్న మరి ముక్తిలేదయా
విశ్వదాభిరామ వినురవేమ //

మాను దిద్దవచ్చు మరి వంక లేకుండ
దిద్దవచ్చు రాయి తిన్నగాను
మనసు దిద్దరాదు మహిమీద నెవరికి
విశ్వదాభిరామ వినురవేమ //

Thursday, 4 June 2020

బ్రతుకులన్ని మాయ భవబంధములు మాయ

బ్రతుకులన్ని మాయ భవబంధములు మాయ
తెలివి మాయ తన్ను తెలియ మాయ
మాయ దెలియు వాడు మర్మజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినురవేమ//

బ్రహ్మ మనగ వేరె పరదేశమున లేదు
బ్రహ్మ మనగ తానె బట్ట బయలు
తన్ను తానెరిగిన తానె పో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ //

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదనభీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ //

భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమములొన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినురవేమ //

మంటి కుండవంటి మాయ శరీరంబు
చచ్చు నెన్నడైన చావదాత్మ
ఘటము లెన్ని యైన గగన మొక్కటె కదా
విశ్వదాభిరామ వినురవేమ //

మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి
మంటిలోనె తిరిగి మనుజుడాయె
మన్ను మిన్ను గలుప మనుజుడే తత్వము
విశ్వదాభిరామ వినురవేమ//

Friday, 22 May 2020

పెక్కు జనుల గొట్టి పేదల వధియించి

పెక్కు జనుల గొట్టి పేదల వధియించి
డొక్క కొరకు నూళ్ళు దొంగిలించి
ఎక్కడికిని బోవ ఎరిగి యముడు జంపు
విశ్వదాభిరామ వినురవేమ //

పేరు సోమయాజి పెనుసింహ బలుడాయె
మేకపోతుబట్టి మెడను విరువ
కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినురవేమ //

ప్రాప్తికలుగు చోట ఫలమిచ్చు దైవంబు
ప్రాప్తి లేని చోట ఫలము లేదు
ప్రాప్తి లేక పసిడి పరమాత్ముడిచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ //

బండ మీద చెలమ పాటించి తవ్విన
అలత యెక్కుడౌను ఆశ లేదు
గుంట పట్టు చెలమ కులముద్ధరించురా
విశ్వదాభిరామ వినురవేమ //

బేసి కంటివాని పెంపార మది నిల్పి
పూజ సేయవలెను బుద్ధి నిలిపి
ఆత్మ పూజ కంటె అదనంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ //

బ్రతుకు నిత్యమనుచు పదరుచు వగమీర
విర్రవీగు వాడు వెర్రివాడు
ప్రాణులెల్ల యముని బారి గొఱ్ఱెలు సుమీ
విశ్వదాభిరామ వినురవేమ //

Thursday, 21 May 2020

పాలు పంచదార పాపరపండ్లలో

పాలు పంచదార పాపరపండ్లలో
చాలబోసి వండ చవికిరావు
కుటిల మానవులకు గుణమేల గల్గురా
విశ్వదాభిరామ వినురవేమ //

పిండములను జేసి పితరుల దలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలార
పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా
విశ్వదాభిరామ వినురవేమ //

పిల్లి ఎలుక బట్ట ప్రియమున నుండంగ
అదియ కోడి బట్ట నునుగమించు
మమత విడువకున్న మానునా మోహంబు
విశ్వదాభిరామ వినురవేమ //

పిసినివాని యింట పీనుగు వెడలిన
కట్టె కోలలకును కాసు లిచ్చి
వెచ్చమాయె ననుచు వెక్కి వెక్కేడ్చురా
విశ్వదాభిరామ వినురవేమ //

పుత్తడి గలవాని పుండు బాధయు గూడ
వసుధలోన చాల వార్త కెక్కు
పేదవాని యింట పెండ్లైన నెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ //

పూజకన్న నెంచ బుద్ధి ప్రధానము
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానము
విశ్వదాభ్రామ వినురవేమ //

Wednesday, 20 May 2020

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ //

పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు
ఊరకుండు వాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినురవేమ //

పరుల మోసపుచ్చి పరధన మార్జించి
కడుపు నింపుకొనుట కాని పద్దు
ఋణము సేయు మనుజు డెక్కువ కెక్కునా
విశ్వదాభిరామ వినురవేమ //

పలుగు రాతిగుండు పగులగొట్టగ వచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠిన చిత్తు మనసు కరగింప రాదయా
విశ్వదాభిరామ వినురవేమ //

పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ
పుష్పజాతి వేరు పూజ యొకటి
దర్శనములు వేరు దైవంబు ఒక్కటి
విశ్వదాభిరామ వినురవేమ //

పాలసాగరమున పవ్వళించినవాడు
గొల్ల యిండ్ల పాలు కోరనేల
ఎదుటి వారి సొమ్ము లెల్లవారికి తీపి
విశ్వదాభిరామ వినురవేమ //

Monday, 18 May 2020

నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు గాడు

నీళ్ళ మునుగు వాడు నిర్మలాత్ముడు గాడు
పూర్ణమైన ముక్తి బొందలేడు
నీరుకోడి యెపుడు నీళ్ళను మునుగదా
విశ్వదాభిరామ వినురవేమ //

నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బయట కుక్క చేత భంగపడును
స్థానబలిమి కాని తన బల్మి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ //

నీళ్ళు బోసి కడిగి నిత్యము శోధించి
కూడు వెట్టి మీద కోక గట్టి
ఏమి పాట్లు పడుదు రీ దేహమున కిల
విశ్వదాభిరామ వినురవేమ //

నేరనన్నవాడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాడు వార్త కాదు
ఊరకున్నవాడెఉత్తమోత్తముడయా
విశ్వదాభిరామ వినురవేమ //

నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె
మనసు భూతమట్లు మలయగాను
శివుని గొల్తుననగ సిగ్గెట్ట రాదురా
విశ్వదాభిరామ వినురవేమ //

పందిపిల్ల లీను పదియునైదింటిని
కుంజరంబు ఈను కొదమనొకటి
ఉత్తముడగు పురుషు డొక్కడు చాలడా
విశ్వదాభిరామ వినురవేమ //

Saturday, 16 May 2020

దిక్కు లేని వాని దీనత బాపిన

దిక్కు లేని వాని దీనత బాపిన
పురుషు డిహము నందె పూజ్యుడగును
పరము నందు వాని భాగ్యమేమనవచ్చు
విశ్వదాభిరామ వినురవేమ //

దూలములను నెక్కి దొమ్మరి గడనెక్క
జాలుదు నన డెపుడు సజ్జనుండు
వీలుమాలు పనులు వెర్రియై చేయునా
విశ్వదాభిరామ వినురవేమ//

ధనము కూడబెట్టి ధర్మంబు చేయక
తాను తినక లెస్స దాచు గాక
తేనె నీగ కూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ వినురవేమ//

నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్య మరయ చాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ//

నిద్ర లోని నిద్ర నిజమని తెలిసిన
భద్ర మగును మిగుల బ్రహ్మవిద్య
నిద్ర తెలియువాడు నిర్మలయోగిరా
విశ్వదాభిరామ వినురవేమ //

నీళ్ళ మునుగ నేల నిధులు మెట్టగనేల
మొనసి వేల్పులకును మొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినురవేమ //

Friday, 15 May 2020

తల్లి యున్న యపుడె తనదు గారాబంబు

తల్లి యున్న యపుడె తనదు గారాబంబు
ఆమె పోవ తన్ను నరయ రెవరు
మంచికాల మపుడె మర్యాద నార్జింపు
విశ్వదాభిరామ వినురవేమ //

తామసించి చేయ తగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనె?
విశ్వదాభిరామ వినురవేమ //

తాము కన్నవారు,తముగన్నవారును
చచ్చుటెల్ల తమకు సాక్షిగాదె
బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మ కల్పంబులా
విశ్వదాభిరామ వినురవేమ//

తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక
అట్టు నిట్టు జూచి అదిరి పడక
తన్నుగాని యట్లు తత్వజ్ఞుడుండును
విశ్వదాభిరామ వినురవేమ //

తేనె తెరల జాడ తేనెటీగ యెరుంగు
సుమరసంబు జాడ భ్రమరమెరుగు
పరమయోగి జాడ భక్తుండెరుంగును
విశ్వదాభిరామ వినురవేమ //

తోలు కడుపులోన దొడ్డవాడుండంగ
రాతిగుళ్ళ నేల రాశి బోయ
రాలు దేవులైన రాశులు మింగవా
విశ్వదాభిరామ వినురవేమ //

Wednesday, 13 May 2020

తనువు నడవి జేసి తనలోనె కూర్చుండి

తనువు నడవి జేసి తనలోనె కూర్చుండి
తపము చేయలేని తపసు లెల్ల
అడవి యందు జేరి అలజడి పడెదరు
విశ్వదాభిరామ వినురవేమ//

తనువు లస్థిరమని ధనము లస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ
విశ్వదాభిరామ వినురవేమ//

తరువ తరువ బుట్టు తరువున ననలంబు
తరువ తరువ బుట్టు దధిని వెన్న
తలప తలప బుట్టు తనువున తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ //

తప్పులెన్నువారు తండోపతండంబు
ఉర్విజనుల కెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ //

తల్లి గర్భమందు తాబుట్టినప్పుడు
మొదలు బట్ట లేదు తుదను లేదు
నడుమ బట్ట గట్ట నగుబాటు గాదొకో
విశ్వదాభిరామ వినురవేమ //

తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్ట నేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమ //

Monday, 11 May 2020

జాతులందు మిగుల జాతి యేదెక్కువో

జాతులందు మిగుల జాతి యేదెక్కువో
యెఱుకలేక తిరుగ నేమి ఫలము?
ఎఱుక గలుగువాడె యెచ్చైన కులజుండు
విశ్వదాభిరామ వినురవేమ //

జీవు జంపుటెల్ల శివభక్తి దప్పుట
జీవు నరసి చూడ శివుడు గాడె?
జీవుడు శివుడనుచు సిద్ధంబు తెలియరో
విశ్వదాభిరామ వినురవేమ //

టక్కరులను గూడి ఎకసెక్కము లాడ
నిక్కమైన ఘనుడి నీతి చెడును
ఉల్లితోట బెరుగు మల్లెమొక్క కరణి
విశ్వదాభిరామ వినురవేమ //

తనదు నృపతితోడ తనయాయుధము తోడ
అగ్ని తోడ పరుల యాలితోడ
హాస్యమాడు టెల్ల ప్రాణాంతకమౌ సుమ్ము
విశ్వదాభిరామ వినురవేమ //

తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప?
ధనము ఎవరి సొమ్ము దాచుకొనగ?
ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప?
విశ్వదాభిరామ వినురవేమ//

తనువునందు అగ్ని దరికొని కాలంగ
కాల్చుకొనుట యేమి కర్మమునకొ
కాల్చుకొన్న యంత ఘనుడు తానయ్యెనా
విశ్వదాభిరామ వినురవేమ //

Sunday, 10 May 2020

చెడ్డవాని జూచి చెరచును దైవంబు

చెడ్డవానిజూచి చెరచును దైవంబు
అడ్డు పడడు వాని కాపదైన
చెడ్డ చేను జూచి రెడ్డి తా మెచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ //

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినురవేమ //

చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు
మేలు వచ్చెనేని మెచ్చు తన్ను
చేటు మేలు తలప చేసిన కర్మముల్
విశ్వదాభిరామ వినురవేమ //

జడలు దాల్చుటెల్ల జగము ఛీయనుటెల్ల
ఒడలు విరుచుటెల్ల యోగమెల్ల
ముక్తికాంత బట్టి ముద్దాడు కొరకురా
విశ్వదాభిరామ వినురవేమ //

జననమరణములకు తను స్వతంత్రుడుగాడు
మొదట కర్త కాడు తుదనుకాడు
నడుమ కర్తననుట నగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ //

జాతి భేదమెంచి జన్మముల్ దెలియక
ముక్తి కానలేరు మూర్ఖ జనులు
జాతులెంచ నేల జన్మంబు తెలియుడు
విశ్వదాభిరామ వినురవేమ //

Friday, 8 May 2020

చదువులన్ని చదివి చాలవివేకియై

చదువులన్ని చదివి చాల వివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంట కుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ //

చావు నేడొ రేపే జతపడి వచ్చును
పెక్కునాళ్ళు కూడబెట్టనేల
అనుచు ఆశ లుడుగు నంతటి వారేరి
విశ్వదాభిరామ వినురవేమ//

చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్కకుక్క కఱచి బాధపెట్టు
బలిమిలేని వేళ పంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ //

చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?
విశ్వదాభిరామ వినురవేమ //

చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీళ్ళ గలిసె
ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ //

చెమట కారునట్లు శ్రమపెట్టి దేహంబు
గడన చేసి కూడు కుడువవలయు
తల్లి దండ్రి సొమ్ము తాదింట కారాదు
విశ్వదాభిరామ వినురవేమ //

Thursday, 7 May 2020

గొడ్డుటావు బిదుక కుండ గొంపోయిన

గొడ్డుటావు బిదుక కుండ గొంపోయిన
పళ్ళనూడ దన్ను పాలనీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ //

చంపకూడ దెట్టి జంతువునైనను
చంపవలయు లోకశత్రుగుణము
తేలుకొండి కుట్టె తేలేమి చేయురా
విశ్వదాభిరామ వినురవేమ //

చంపదగిన యట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగమేలు చేసి పొమ్మనుటె చావు
విశ్వదాభిరామ వినురవేమ //

చంపదలచు రాజు చనవగ్గలంబిచ్చు
చెరుపనున్న పగర చెలిమిసేయు
కరవనున్న పాము నెరిగాచుకొని యుండు
విశ్వదాభిరామ వినురవేమ //

చదువు చదువకున్న సౌఖ్యంబులును లేవు
చదువు చదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదివిన చదువురా
విశ్వదాభిరామ వినురవేమ //

చదువులందుపాడి మొదవులందున స్త్రీల
పెదవులందు రాజ పదవులందు
ఆశలుడిగినట్టి అయ్యలు ముక్తులు
విశ్వదాభిరామ వినురవేమ //

Wednesday, 6 May 2020

గాలి గాలి కలిసె గగనంబు గగనంబు

గాలి గాలి కలిసె గగనంబు గగనంబు
మన్ను మన్ను గలిసె మంట మంట
నీరు నీట గలిసె నిర్మలంబై యుండె
విశ్వదాభిరామ వినురవేమ //

గుణములు గలవాని కులమెంచగా నేల
గుణము గలిగెనేని కోటి సేయు
గుణము లేక యున్న గుడ్డి గవ్వకు సాటి
విశ్వదాభిరామ వినురవేమ //

గుణయుతునకు మేలు గోరంత జేసిన
కొండయౌను వాని గుణము చేత
కొండ కొద్ది మేలు గుణహీనుడెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ//

గురువు లేక విద్య గురుతుగా దొరకదు
నృపతి లేక భూమి తృప్తి గాదు
గురువు విద్య లేక గురుతర ద్విజుడౌనె?
విశ్వదాభిరామ వినురవేమ //

గువ్వ కొరకు మేను గోసి యా శిబిరాజు
వార్త విడువరాక కీర్తి కెక్కె
ఓగు నెంచబోవ రుపకారి నెంతురు
విశ్వదాభిరామ వినురవేమ //

గూబ చేర గృహము గునిసి పాడుగ బెట్టి
వెళ్ళిపోదు రెంత వెర్రివారొ
గూబ గృహము లేమి కూర్చురా కర్మంబు
విశ్వదాభిరామ వినురవేమ //

Tuesday, 5 May 2020

కోపమునను ఘనత కొంచెమై పోవును

కోపమునను ఘనత కొంచెమైపోవును
కోపమునను మిగుల గోడు గలుగు
కోప మడచె నేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ //

కోరి దృపదు పట్టి కొప్పు బట్టీడ్చిన
సింహబలుని చావు చెప్పదరమె
ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా
విశ్వదాభిరామ వినురవేమ //

ఖలులు తిట్టిరంచు కలవరపడ నేల
వారి తిట్ల నేమి వాసి చెడును
సజ్జనుండు తిట్ట శాపంబెయౌనురా
విశ్వదాభిరామ వినురవేమ //

గంగ పారుచుండు కదలని గతి తోడ
మురికి కాల్వ పారు మోత తోడ
అధికు డోర్చునట్లు అధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ //

గంగి గోవు పాలు గంటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ//

గాడ్దె మేన నిండ గంధంబు బూసిన
బూదిలోన బడుచు పొరలు మరల
 మోటువాని సొగసు పోలికే ఇది సుమీ
విశ్వదాభిరామ వినురవేమ //

Monday, 4 May 2020

కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు

కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు
సానుజతమయ్యె సకల గుణము
హెచ్చు తగ్గు మాట లెట్లెరుంగగవచ్చు
విశ్వదాభిరామ వినురవేమ//

కూడు బెట్టకున్న కుక్షిలోజఠరాగ్ని
భక్షణంబు సేయు కుక్షి మలము
కూడు విడిచి మలము గుడుచురా ఉపవాసి
విశ్వదాభిరామ వినురవేమ //

కూర యుడుకు వెనుక కూడునా కసవేర?
యెరుక కలిగి మునుపె యేరవలయు
స్థలము తప్పు వెనుక ధర్మంబు బుట్టునా
విశ్వదాభిరామ వినురవేమ //

కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి
హృదయ మట్టె మిగుల పదిల పరచి
గృహము నిల్పువాడు బహుతత్వవేదిరా
విశ్వదాభిరామ వినురవేమ //

కోటి దానమిచ్చి కోపంబు సేయుచో
పాటి సేయ రతని ప్రజలు మెచ్చి
సత్వగుణము  చేత సజ్జనుండగునయా
విశ్వదాభిరామ వినురవేమ //

కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల కొలిచినట్లు
నీతిహీను నొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ //


కుండ పగిలెనేని కొత్తది కొనవచ్చు

కుండ పగిలెనేని కొత్తది కొనవచ్చు
భూతలంబు నందు పొందుగాను
కూలబడిన నరుడు కుదురుట అరుదయా
విశ్వదాభిరామ వినురవేమ //

కుక్క గోవు గాదు కుందేలు పులిగాదు
దోమ గజము గాదు దొడ్డదైన
లోభి దాతగాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ వినురవేమ //

కుక్క యేమెరుంగు గురులింగ జంగంబు
పిక్క బట్టి యొడిసి పీకుగాక
సంతపాక తొత్తు సన్యాసి నెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ //

కులము నీరు జేసి గురువును వధియింప
పొసగ నేనుగంత బొంకు బొంకె
పేరు ధర్మరాజు పెను వేపవిత్తయా
విశ్వదాభిరామ వినురవేమ //

కులములోన నొకడు గుణవంతు డుండెనా
కులము వెలయు వాని గుణము వలన
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ //

Saturday, 2 May 2020

కల్లు కుండకెన్ని ఘనభూషణము లిడ్డ

కల్లు కుండకెన్ని ఘనభూషణము లిడ్డ
అందులోని కంపు చిందులిడదె
తులువ పదవి గొన్న తొలిగుణ మేమగు
విశ్వదాభిరామ వినురవేమ //

కానలేడు నుదురు కర్ణముల్ వీపును
నెరులు గానలేడు  నెత్తిమీద
తన్నే కానలేడు తత్వమే మెరుగురా
విశ్వదాభిరామ వినురవేమ //

కానివాని తోటి కలిసి వర్తించెనా
హాని వచ్చు నెంతవానికైన
తాటి క్రిందపాలు తాగిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ //

కాశి నీళ్ళు మోసి కాళ్ళు మొగము వాచి
ఎందు సుఖములేక ఎండి యెండి
చచ్చి  వెనుక ముక్తి సాధింపగలరొకో
విశ్వదాభిరామ వినురవేమ //

కుండ కుంభమండ్రు కొండ పర్వత మండ్రు
ఉప్పు లవణమండ్రు ఒకటిగాదె
భాషలింతె  వేరు పరతత్వ మొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ //

కుండ చిల్లి పడిన గుడ్డ దోపగవచ్చు
పనికి వీలు పడును బాగుగాను
కూలబడిన నరుడు కుదురుట అరుదయా
విశ్వదాభిరామ వినురవేమ //

Friday, 1 May 2020

కనియు గానకుండు కదలింపడా నోరు

కనియు గానకుండు కదలింపడా నోరు
వినియు వినకయుండు విస్మయమున
సంపదగలవాని సన్నిపాతంబది
విశ్వదాభిరామ వినురవేమ //

కనులు లేనివాడు కాళ్ళుపోయునవాడు
ఉభయు లరయ గూడియుండునట్లు
పేదపేద గూడి పెనగొని యుందురు
విశ్వదాభిరామ వినురవేమ //

కన్నులందు మదము గప్పి కానరుగాని
నిరుడు ముందటేడు నిన్న మొన్న
దగ్ధులైనవారు తమకంటె తక్కువా?
విశ్వదాభిరామ వినురవేమ //

కసరు దినును గాదె పసరంబులెప్పుడు
చెప్పినట్టు వినుచు సేయు పనులు
వాని పాటియైన మానవు డొప్పడా
విశ్వదాభిరామ వినురవేమ//

కర్ణుడొకడెగాని ఘనులెవ్వరును లేరు
దానశీలుడంచు దలప బడను
తలప ధనము కర్ణు దాతను జేసెను
విశ్వదాభిరామ వినురవేమ //

కలిమినాడు నరుడు కాన్పు మదమున
లేమినాడు పెట్ట లేదు మొదలె
కలిమి లేమి లేని కాలంబు కలుగునా
విశ్వదాభిరామ వినురవేమ //

Thursday, 30 April 2020

ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని

ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు
పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ //

ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి
బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి
సద్గుణంబు లేని చదువది యేలరా
విశ్వదాభిరామ వినురవేమ //

కంకుభట్టనంగ కాషాయములు గట్టి
కొలిచె ధర్మరాజు కోరి విరటు
కాలకర్మగతులు కనిపెట్టవలెనయా
విశ్వదాభిరామ వినురవేమ //

కట్టెయందు నిప్పు గానని చందాన
తనువునందు నాత్మ దగిలియుండు
మరుగు దెలిపి పిదప మార్కొన వలెనయా
విశ్వదాభిరామ వినురవేమ //

కడక నఖిలమునకు నడినాళ మందున్న
వేగుచుక్క వంటి వెలుగు దిక్కు
వెలుగుకన్న దిక్కు వేరెవరున్నారు
విశ్వదాభిరామ వినురవేమ //

కనక పర్వతమున కాపురంబుండిన
అనిమిషేశ్వరునకు ఆస పోదు
కనక కుండలములు కర్ణుడి అడుగడా
విశ్వగాభిరామ వినురవేమ //

Wednesday, 29 April 2020

ఎలుక తోలు తెచ్చి ఏడాది వుతికినా

ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన
నలుపు నలుపె కాని తెలుపు రాదు
కొయ్య బొమ్మ దెచ్చి కొట్టిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ //

ఏమి గొంచు వచ్చె ఏమి తాగొనిపోవు
పుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటి కేగు తానేగు నెచటికి
విశ్వదాభిరామ వినురవేమ //

ఏరుదాటి మెట్టకేగిన పురుషుడు
పుట్టి సరుకు గొనకపోయునట్లు
యోగపురుషు డేల యొడలు పాటించురా
విశ్వదాభిరామ వినురవేమ //

ఐకమత్యమొక్క టావశక్యం బెప్డు
దాని బలిమి నెంత యైనకూడు
గడ్డి వెంటి బెట్ట కట్టదా యేనుంగు
విశ్వదాభిరామ వినురవేమ //

ఒడలు బూది బూసి జడలు ధరించిన
ఒడయడైన ముక్తి బడయలేడు
తడక బిర్రుబెట్ట తలుపుతో సరియౌనె
విశ్వదాభిరామ వినురవేమ //

ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన
దానగుణము లేక దాత యగునె
ఎనుము గొప్పదైన ఏనుగు బోలునా
విశ్వదాభిరామ వినురవేమ //


Tuesday, 28 April 2020

ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినగాని

ఎంత చదువు చదివి ఎన్ని నేర్చిన గాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలుగడుగ పోవునా మలినంబు
విశ్వదాభిరామ వినురవేమ //

ఎంత సేవజేసి ఏపాటు పడినను
రాచమూక నమ్మరాదురన్న
పాముతోడి పొందు పదివేల కైనను
విశ్వదాభిరామ వినురవేమ //

ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన
మాట తెలిసి నడచు మర్మమెరిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ //

ఎరుక కన్నను సుఖ మేలోకమున లేదు
యెరుక నెరుగ నెవని కెరుక లేదు
యెరుకసాటి యెరుక యెరుకయే తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ//

ఎరుక లేని దొరల నెన్నాళ్ళు గొలిచిన
బ్రతుకు లేదు వట్టి భ్రాంతిగాని
గొడ్డుటావు పాలు గోకితే చేపునా?
విశ్వదాభిరామ వినురవేమ //

ఎరుగువాని దెల్పనెవ్వడైనను చాలు
ఒరుల వశము గాదు ఓగుదెల్ప
ఏటి వంక దీర్ప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ //

Monday, 27 April 2020

ఉత్తముని కడుపున నోగు జన్మించిన

ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాడు చెరచు వాని వంశమెల్ల
చెరకు వెన్ను బుట్టి చెరపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినురవేమ //

ఉదధి లోన నీళ్ళు ఉప్పులుగా జేసి
పసిడి గల్గువాని పిసిని జేసె
బ్రహ్మదేవుచేత పదడైన చేతరా
విశ్వదాభిరామ వినురవేమ //

ఉన్న ఘనతబట్టి మన్నింతురే గాని
పిన్న పెద్ద తనము లెన్నబోరు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
విశ్వదాభిరామ వినురవేమ //

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినురవేమ //

ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడచూడ రుచులు జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ //

ఎంగిలెంగిలనుచు ఈ నోటి తోడనే
వేదములను జదువు వెర్రులార!
ఎంచిచూడ నదియు ఎంగిలి గాదొకో
విశ్వదాభిరామ వినురవేమ //

Sunday, 26 April 2020

అర్జున విషాద యోగము శ్లోకము1-5

ధృతరాష్ట్ర ఉవాచ...
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః/
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ//(1)

సంజయ ఉవాచ...
దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా/
ఆచార్య ముపసంగమ్య రాజా వచనమబ్రవీత్//(2)

పశ్యైతామ్ పాండు పుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్/
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమాతా//(3)

అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమాయుధి/
యుయుధానో  విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః//(4)

ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్/
పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః//(5)


ఇరుకు వచ్చు వేళ

ఇరుకు వచ్చువేళ ఈశ్వరు నెంతురు
కరుణ గనునె వట్టి గాసిగాక
సుఖము వచ్చు వేళ చూడంగ నొల్లరు
విశ్వదాభిరామ వినురవేమ //

ఇల్లు నాలి విడచి ఇనుపకచ్చలు గట్టి
వంటకంబు నీటి వాంఛ లుడిగి
ఒంటినున్న యంత ఒదవునా తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ //

ఇహమున సుఖియింప హేమతారక విద్య
పరమున సుఖియింప బ్రహ్మవిద్య
కడమ విద్యలెల్ల కల్ల మూఢులకురా
విశ్వదాభిరామ వినురవేమ //

ఇహము విడువ ఫలము యింపుగ గలదని
మహిని బలుకు వారి మతము కల్ల
ఇహము లోన పరము నెసగుటగానరో
విశ్వదాభిరామ వినురవేమ //

ఈతకన్న లోతు నెంచగ పనిలేదు
చావుకన్న కీడు జగతిలేదు
గోచిపాత కంటె కొంచెంబు మరిలేదు
విశ్వదాభిరామ వినురవేమ //

ఉత్తతిత్తి దీని ఉపయోగములు లేవు
తిత్తి కొరకు జెడును దేవులాడి
కత్తిమీదిసాము కడతేర బోదయా
విశ్వదాభిరామ వినురవేమ //

Friday, 24 April 2020

ఆశకన్న దుఃఖ మతిశయంబుగ లేదు

ఆశ కన్న దుఃఖ మతిశయంబుగలేదు
చూపు నిలుపకున్న సుఖములేదు/
మనసు నిలుపకున్న మరి ముక్తిలేదయా
విశ్వదాభిరామ వినురవేమ //

ఇంచుకంత బోన మీశ్వరార్పణ మన్న
పుణ్యలోకములకు బోవు నతడు
కర్మసూక్ష్మములను కనవలె ఘనులెల్ల
విశ్వదాభిరామ వినురవేమ //

ఇంటియాలి విడిచి ఇల జారకాంతల
వెంట దిరుగువాడు వెర్రివాడు
పంటచేను విడిచి పరిగ యేరినయట్లు
 విశ్వదాభిరామ వినురవేమ //

ఇంటిలోని ధనము నిది నాది యనుచును
మంటిలోన దాచు మంకుజీవి
కొండబోడు వెంట గుల్లకాసైనను
విశ్వదాభిరామ వినురవేమ //

ఇంద్రియములు బట్టి ఈడ్చుచు నుండగా
వెర్రి మనుజుడేల వెదకు శివుని
ఇంద్రియముల రోసి ఈశుని జూడరా
విశ్వదాభిరామ వినురవేమ //

ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరి యంటనేర్చునా
విశ్వదాభిరామ వినురవేమ//

Wednesday, 22 April 2020

ఆత్మలోన శివుని అనువుగా శోధించి

ఆత్మలోన  శివుని అనువుగా శోధించి
నిశ్చలముగ భక్తి నిలిపెనేని
సర్వముక్తుడౌను సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినురవేమ//

ఆత్మలోని  సొమ్ము అంజనమున జూచి
అంటి తిరుగునట్టి యతడు యోగి
పుంజు గూటి నుండి పొద్దెరింగియు కూయు
విశ్వదాభిరామ వినురవేమ //

ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల
భాండ శుద్ధిలేని పాకమేల
చిత్త శుద్ధిలేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినురవేమ //

ఆలి మాటలు విని యన్నదమ్ముల బాసి
వేరు బడెడువాడు వెర్రి వాడు
కుక్క తోకబట్టి గోదావరీదునా?
విశ్వదాభిరామ వినురవేమ //

ఆలి వంకవార లాత్మబంధువు లైరి
తల్లి వంకవారు తగినపాటి
తండ్రి వంకవారు దాయాదు లైరయా
విశ్వదాభిరామ వినురవేమ//

ఆలుసుతులు మాయ అన్నదమ్ములు మాయ
తల్లి తండ్రి మాయ తాను మాయ
తెలియ నీదు మాయ దీనిల్లు పాడాయ
విశ్వదాభిరామ వినురవేమ//

Sunday, 19 April 2020

అల్పబుద్ధి వాని కధికార మిచ్చిన

అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డలారి నెల్ల తొలగ గొట్టు
చెప్పు దిన్న కుక్క చెరకు తీపెరగువా?
విశ్వదాభిరామ వినురవేమ//

అల్పసుఖము లెల్ల నాశించి మనుజుండు
బహుళదుఃఖములను బాధపడును
పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరదు
విశ్వదాభిరామ వినురవేమ//

అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ//

ఆకుమీది వ్రాత అందరికి తెలియు
చేతిలోని వ్రాత చెప్పవచ్చు
తోలుకిందివ్రాత దొడ్డవాడెరుగును
విశ్వదాభిరామ వినురవేమ//

ఆకులెల్ల దిన్న మేకపోతుల కేల
కాక పోయెనయ్య కాయసిద్ధి
లోకులెల్ల వెర్రిపోకళ్ళ బోదురు
విశ్వదాభిరామ వినురవేమ//

ఆడుదాని జూడ అర్ధంబు పొడగన్న
బ్రహ్మకైన బుట్టు రిమ్మ తెగులు
బ్రహ్మ ఆలితాడు బండి రేవున తెంచ
విశ్వదాభిరామ వినురవేమ //

Friday, 17 April 2020

అనగ ననగ రాగ

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయ నుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ//

అనువుగానిచోట అధికులమనరాదు
కొంచెముండు టెల్ల కొదువగాదు
కొండ అద్దమందుకొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ//

అన్నరసము వలన అల బిందురసమయ్యె
బిందురసము వలన బీజమయ్యె
బిందుబీజములకు భేదంబు చూడరా
విశ్వదాభిరామ వినురవేమ//

అన్ని గోసివేసి అనలంబు చల్లార్చి
గోచి బిగియ గట్టి కోపమడచి
ఆస విడిచెనేని అతడె తా యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ//

అన్ని దానములను అన్నదానమెగొప్ప
కన్నవారికంటె ఘనులు లేరు
ఎన్న గురువు కంటె ఎక్కువలేరయా
విశ్వదాభిరామ వినురవేమ//

అప్పులేనివాడె అధికసంపన్నుడు
తప్పులేని వాడు ధరను లేడు
గొప్పలేని బుద్ధి గొంచెమైపోవురా
విశ్వదాభిరామ వినురవేమ//


Wednesday, 15 April 2020

అంతరంగమందు

అంతరంగమందు అపరాధములు జేసి
మంచివాని వలెను మనుజుడుండు
ఇతరు లెరుగకున్న ఈశ్వరుడెరుగడా
విశ్వదాభిరామ వినురవేమ//

అంతరంగమందు అభవునుద్దేశించి
నిలిపి చూడచూడ నిలుచుగాక
బాహ్యమందు శివుని భావింప నిలుచునా
విశ్వదాభిరామ వినురవేమ//

అడవి దిరుగ జిక్క దాకసమునలేదు
అవని తీర్థయాత్రలందు లేదు
ఒడలు శుద్ధిచేసి ఒడయని చూడరా
విశ్వదాభిరామ వినురవేమ//

అదిమి మనసు నిలిపి ఆనందకేళిలో
బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు
జిహ్వరుచులచేత జీవుండు చెడునయా
విశ్వదాభిరామ వినురవేమ//

అధికుడైన రాజు అల్పుని చేబట్ట
వాని మాట చెల్లు వసుధ లోన
గణకు లొప్పి యున్న గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ//